హాయ్ బ్లాకొల్లెగాస్ (అంటే బ్లాగు మిత్రులారా),
బ్లాగ్ ప్రపంచంలో మొదటి అడుగు వేస్తున్నాను...చాల రోజులుగా బ్లాగ్లోకంతో పరిచయం ఉన్నా పంచుకోవడం మాత్రం ఇదే మొదటిసారి...పూర్వ కాలంలో రాతగాడిగా (విలేఖరి) ఉన్న నేను ప్రస్తుతం వేటగాడిగా(పోలీస్ అధికారిగా) ఉన్నాను...బ్లాగ్లొకంలో విహరించినప్పుడల్లా నన్నూ ఈ రొంపి లోకి దిగమని నాలోని పాత రాతగాడు తెగ నసపెట్టేవాడు..అయితే చేస్తున్న ఉద్యోగం వలన అంత సమయం దొరకలేదు..ఒకవేళ దొరికినా కొంత బద్దకం మరికొంత ప్రారంభ కష్టం....మరిప్పుడెలా సాధ్యమయిందని అనుకొంటున్నారా ? అదే చెప్పబోతున్నాను...ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో INSPECTOR OF POLICE గా పని చేస్తున్న నాకు ఐక్యరాజ్య సమితి “శాంతి పరిరక్షకదళంలో” ఒక సంవంత్సరం పాటు డిప్యుటేషన్ పై పని చేసే అవకాశం వచ్చింది..ఇక కట్ చేస్తే ఆస్ర్టేలియా, ఇండోనేషియా మధ్యలోనున్న తూర్పు తైమూర్ అనే ఒక చిన్న ద్వీప దేశంలో లో ప్రస్తుతం “ఐరాస పోలీసుగా” (UN POLICE) పనిచేస్తున్నాను...ఆంధ్రదేశంలోని అందరికి దూరంగా ఉన్న నాకు ఇంటర్ నెట్ తో దోస్తానా ఎక్కువైంది. ఫేస్ బుక్ పరిచయాలు, పొస్టింగులు, పంచుకోవడాలు, కొత్త విషయాలని నంజుకోవడాలు జరుగుతున్నాయి...కొత్త ప్రాంతం, కొత్త వ్యక్తులు, కొత్త ఆచార వ్యవహరాలు..ఇలా అంతా కొత్తే...మన పరిస్తితులతో, సంస్క్రతితొ సరిపోల్చినపుడు మరింత వింతగా అనిపించింది..నాకు నచ్చిన విషయాలు, నవ్వు తెప్పించిన సంఘటనలు వగైరా నలుగురితో పంచుకొవాలనిపించింది...ఈ మథనం నాలోని పాత రాతగాడిని నిద్ర లేపాయి... రాయడానికి పురికొల్పాయి...మొదట ఫేస్ బుక్ లో పోస్టింగులు చేసాను, చేస్తున్నాను...కాని నాకెందుకో నచ్చడం లేదు... నా ఉద్దేశ్యంలో ఈ ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వలన అందరం "షార్ట్ మెమరి గజనీ"లం అవుతున్నాము.. పోస్ట్ చదివిన వరకే ఆ రసోద్వేగం, భావోద్వేగం...ఆ తర్వాత ఏమి గుర్తుండదు...మళ్ళీ మన ముందు ఇంకో పోస్టింగు ప్రత్యక్షం...నచ్చిన పోస్టింగును మళ్ళీ చూడాలంటే మహ కష్టం అయిపోతున్నది.. ఏ రోజైన మిస్ అయ్యామో , దాదాపుగా ఇక ఆ పోస్ట్ చూడలేకపోతున్నాము...ప్రత్యేకంగా ఎవరైనా దానిని చూడమని గుర్తు చేయాలి...ఎందుకో నాకు మాత్రం ఇదంతా "మెటీరియలిస్టిక్" గా అనిపిస్తుంది... కాని బ్లాగ్ విషయంలో మాత్రం మినహాయింపు ఉన్నది...బ్లాగ్ లో నాకు " హ్యుమన్ టచింగ్" గా ఉంటుంది.. ఇందులో మళ్ళీ మళ్ళి చదువుకొనే సదుపాయం, నచ్చినదానిని వెదుక్కొనే సదుపాయం ఉంది. అదీగాక రాతగాడి రాతలకు శాశ్వతత్వం లభిస్తుంది… నాకైతేఈ రెండింటి మధ్య నున్న తేడా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ల మధ్యనున్న తేడా తో సమానం...ఇరవై నాలుగు గంటలు టివి కి అతుక్కుపోయినా కూడా, తెల్లారగానే న్యూస్ పేపర్ను టాప్ టు బాటం చదివితేగాని మన లోని జీవుడి కి తుత్తి లభించదు...అదే న్యూస్ పేపర్ మహత్యం..సరిగ్గా పేపర్ కున్నలక్షణాలే బ్లాగ్ కు ఉన్నాయి..అదే నన్ను బ్లాగ్ రాతకు ఉరికొల్పింది...అయితే ఇన్ స్టంట్ ఇన్సిపిరేషన్ మాత్రం ...నాకిక్కడ చాలా ఖాళీ సమయం దొరకడం, రాయడానికి సరుకు చాలా ఉండడం, అదీగాక నాలోని పాత రాతగాడి గురించి తెలిసిన నా హితులు, సన్నిహితులు "రాయోచ్చు కదా" అని గుర్తుచేయడం..ముఖ్యంగా రవిమా, ఝాన్సీ, రాకాజీ.... అలా గుర్తు చేసి రెచ్చగొట్టిన మిత్రులందరికి ధన్యవాదాలు.
ఇక బ్లాగ్ గురించి...పేరు చూసారుగా... “మిఠాయిపొట్లం”.నాకు ఏడుపుగొట్టు సీరియళ్ళు, సినిమాలు అంటే పరమ అలర్జి...హప్పీ ఎండింగ్ లేకుంటే సినిమా అయినా, నవల అయినా మధ్యలోనే వదలాల్సిందే...ఏ వ్యక్తి కూడా ఒకటో రెండొ గాట్టి లెక్చర్లు విని మారిపోయడంటే అస్సలు నమ్మను...మార్పు అనేది అంతర్గంతంగా ప్రారంభం అవుతుంది... ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా బ్లాగ్ ద్వారా "సుమతి శతకావళీ" నా ఉద్దేశ్యం కాదు..అదే విధంగా పేజిల కొద్ది విషయం రాయలేను, రాసి బోర్ కొట్టించలేను...కారణం అంత సమయం దొరికి చావదు,ఒకవేళ దొరికి రాసినా మీకూ సమయం దొరికి చావదు...కావున మీ,నా శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకోని మరీ ఎక్కువ బోర్ కొట్టించకుండా ముచ్చట్ట్లు పంచుకుంటాను..ఇక మీరునంజుకోండి...ఫైనల్ గా చెప్పేదేమిటంటే ఇది మృష్టాన్నభోజనం కాదు...సింపుల్ మిఠాయి పొట్లం...నా బ్లాగ్ తెరవగానే సరదాగా , సందడి సందడి గా ,సంబరం కలిగించేలా ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను...విషయం కూడా అలాగే ఉండేలాగా జాగ్రత్త పడుతాను..సరదా విషయాలు, నాకు నచ్చిన, నేను మెచ్చిన విషయాలు, అడపా దడపా జోకులు, సిత్రాలు, మా పోలీసు బాద్యతలు,బరువులు, బాధల గురించి కొంత చెప్పె యత్నం వగైరా ఉంటాయి..తప్పనిసరి అయి, అది అందరికి ఉపయోగపడేది అయితేనే సీరియస్ విషయాలు చర్చిస్తాను..ఫ్రస్తుతం తూర్పు తైమూర్ లో ఉన్నాను కనుక ఇక్కడి " ముచ్చట్లు" పంచుకుంటాను.. ఇక బ్లాగ్ పోస్టింగ్ లకు వెళ్దామా...వెళ్ళేముందు మీరో పని చేయాలి. " నా ఈ బ్లాగు ఆరంభ శూరత్వంకావొద్దని, కనీసం వారానికి ఒకటైనా కంటిన్యూగా పోస్టింగులు పడుతూఉండాలని, మీ అందరి మన్ననలు పొందాలని, అందరి ముఖాలలో చిరునవ్వులు చిందించేలా చేయాలని " నా ఈ తీపి ప్రయత్నాన్ని అంతర్జాల బ్లాగు దేవుల్లారా ఆశీర్వదించండి..(ఏమైనా తప్పులుంటే అడ్జస్ట్
చేసుకోండి).
సదా మీ చిరునవ్వులని ఆశించే మీ ఆశగొట్టు....
నరేందర్ జవ్వాజి.
ముందుగా బ్లాగు ప్రారంభించినందుకు కంగ్రాట్స్ .......
రిప్లయితొలగించండిఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఎన్నో రకాల పనుల ఒత్తిడిలొ వివిధ రకాల కారణాల వల్ల నాకున్న మీడియా(న్యూస్ ప్రెసెంటర్) అభిరుచిని కొనసాగించలేకపోతున్నాను.కాని నువ్వు బ్లాగు ప్రారంభించి మళ్ళి నాకు కొత్త ఉత్సాహన్ని ఇచ్చావు....త్వరలో నేను కూడా ఎదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నా.....ఈ మెటీరీలిస్టిక్ జిందగీ నాకు నచ్చదు ...ఎంతైనా నువు గ్రేట్ రా ....లవ్ యు :)
మొదటి వ్యాఖ్య కూడా నాదే ....Keep rocking
Thanks raa... try to make it follow my blog regularly n give valuable feedback
తొలగించండిmetrama eppude nee blogayanam chadiva.metay potlam lo teneluru vishayalu ennenno,mottaniki marichina kavitvapu pythyanni gurtuku thechav.e roju neeku mail cheddamani mail box open chesa,asalu vishayam group 1 marks webcite lo peettaru..praveen
రిప్లయితొలగించండిNakaite paata narendra gurtochadu... Keka...
రిప్లయితొలగించండిOffice lo time ledu... Taravata detailed ga raasta...
రిప్లయితొలగించండిNari.. awe some.. just continue it. I want you to write at least 3-4 pages of diary every day, so that you can publish a book on your UN trip. I am seeing entire ET with your writings/postings.. keep on posting/writing.. Nee loni kavi nidra lepinanduku aa devudiki sarvada kruthagnunni..
రిప్లయితొలగించండిGudluck
Hearty welcome to blog world. plz eliminate word verification
రిప్లయితొలగించండి