7, జులై 2018, శనివారం

ఎలుకలకు నిలయం ఈ వింత ఆలయం



మూషికాలయం

 

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళి నా “మిఠాయి పొట్లం”  విప్పుతున్నాను...విషయం అంతలాగా ఉంది కాబట్టి , అర్జంటుగా “అంతర్జాల సహవాసులందరితో పంచుకోవాలనిపించింది..ఇక మొదలెట్టండి ..
కర్ణి మాత ఆలయం ... రాజస్థాన్ లోని  బికనీర్ కు ౩౦ కిలోమీటర్ల దూరంలో ఈ  వింతయిన , విచిత్రమైన ఆలయం ఉంది. నా అధికారిక విధుల్లో బాగంగా బికనీర్ వెళ్ళిన నేను , ఈ ఆలయాన్ని గురించి ఒళ్ళు కంపరం ఎత్తించే , గగుర్పొడించే వింతలు , విశేషాలు విన్న తర్వాత అక్కడికి ఖచ్చితంగా వెళ్లి తీరాలని డిసైడ్ అయిపోయి , వెల్లోచ్చాను...నిజంగానే ఆలయంలోకి అడుగుపెట్టిన నాకు ఒక రకమైన గగుర్పాటు కలిగింది, కారణం...అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, వందలు కాదు ...వేలకొద్ది  మూషికాలు చుట్టుముట్టాయి !!.వేలాదిగా ఎలుకలు అటూ ఇటూ తిరుగుతూ నానా హడావిడి చేస్తూ , మన కాళ్ళ మధ్యనుండి పరుగెడుతుంటే , ఎక్కడ వాటిని తోక్కేస్తామేమోననే కంగారు ఓ వైపు, మరో వైపు అవి ఎక్కడ కరుస్తాయోననే భయం..ఇలా లోపలికి అడుగు పెట్టిన తర్వాత భయం, ఆశ్చర్యం,ఆనందం, ఆందోళన ఇలా నవరసానుభూతులు ఒక్కసారే కలిగాయి..భయం , భయంగా “కర్నిమాత “ ను దర్శించుకున్నాను, అక్కడా  అమ్మ వారి చుట్టూ , నైవేద్యాల పళ్ళేల చుట్టూ గుంపులు గుంపులుగా ఉన్నాయి..
కొన్ని నిద్రావస్టలో, మరికొన్ని  భుక్తావస్తలో , ఇంకొన్ని సుప్త చేతనావస్థలో , ఇంకొన్నిఆటల్లో , పాటల్లో ....అబ్బో వండర్ఫుల్ ..అసలు ఆ ఆలయంలో ఇంతగా ఈ ఎలుకల గుంపు ఉండటం వెనుక ఒక కథ ప్రాచారంలో ఉంది.
          అమ్మవారు “కర్నిమాత “ దుర్గామాత ఉపాసకురాలు, ఆమెకు నలుగురు సంతానం , ఆ నలుగురిలో ఒకరు అ ఆకస్మాత్తుగా మరణించడంతో , కర్నిమాత “యమ ధర్మరాజు “ తో గొడవకు దిగుతుంది, ఆయన తోవకు అడ్డుగా నిలుస్తుంది , తన కొడుకును బ్రతికించే , అక్కడినుండి కదులుమని ప్రార్థిస్తుంది ..అయితే సృష్టి ధర్మానికి విరుద్దంగా తానూ వ్యవహరించలేనని యముడు , ససేమిరా అంటూ కర్నిమాత ...ఇక చివరికి మధ్యేమార్గంగా యమధర్మరాజు కర్నిమాత సుతుడికి పునర్జన్మ ప్రసాదిస్తాడు , అయితే అది మానవ జన్మ గా కాక “ఎలుక “ జన్మ ను ప్రసాదిస్తాడు.. ఏమైతేనేమి సతీ సావిత్రి “పతి” కోసం యముడితో పోరాటం చేయగా , కర్నిమాత “సుతుడి” కోసం పోరాడి విజయం సాదించింది..అందుకే భక్తులందరూ అప్పటి నుండి ఈ ఎలుకలని కర్నిమాత సంతానంగా భావించి , వాటిని కూడా అమ్మవారితో సమానంగా భయబక్తులతో ఆరాదిస్తారు , వాటికి కీడు హాని కలిగించే ఎలాంటి చర్య చేపట్టరు ..
          నాకు ఈ ఆలయ వింతలు , విశేషాలు “వి ఐ పి” దర్శనం చేయించిన “దేవేందర్” కర్నిమాత వంశస్తుడు ..మరికొన్ని విశేషాలు నాతో పంచుకున్నాడు , అవి మీ కోసం ...
·        ఇంతగా వేలకు వేలకు గుంపులు గుంపులుగా ఎలుకలు తిరిగినా , ఒక్కసారి కూడా చనిపోయిన  ఎలుఒక్కటి కూడా కనపడలేదట , వినపదలేదట.
·        ఆలయద్వారాలు ఉదయం 4 నుండి రాత్రి 10 గంటల వరకు తెరచివున్నా , ఇవి వేలకు వేలు ఉన్నా ఒక్క ఎలుక కూడా ప్రధాన ద్వారం దాటి బయటికి    వెళ్ళవట..  అంటే  ఎట్టి పరిస్థితుల్లోనూ  “ సరిహద్దు దాటవన్నమాట

ఉదయం నాలుగు గంటలకి మాతకు అభిషేక , నైవేద్య హరతుల అనంతరం చేసే మృదంగ , భేరి నాదాలకు ...అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని “మూషిక దండు “ వేలుగా వచ్చి నైవేద్యాన్ని ఆరంగిస్తాయి.
ఇక అప్పటి నుండి మొదలు
, రాత్రి  వరకు అటు , ఇటూ తిరిగి గోల గోల గా తిరిగి పది కాగానే అన్నీ చటుక్కున మాయమైపోతాయి ( అంటే రెస్ట్ లోకి అని అర్థం }
·        ఎలుకలు నల్లగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే , “ఎలుక తోలూ తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా , నలుపు నలుపే కాని తెలుపు కాదు “ అనే పద్యం గుర్తు కూడా వస్తది ..కాని ఇక్కడ “తెల్ల ఎలుకలు “ కొన్ని ఉన్నాయి,  అయితే అవి అప్పుడప్పుడు మాత్రమె కనపడుతుంటాయి ...వాటిని దర్శించుకుంటే “దరిద్రం “ అంతా పోతుందని , మంచి రోజులు మస్తుగా వస్తాయని నమ్మకంతో ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు గంటలు గంటలుగా పడిగాపులు కాస్తుంటారు
·        వేలకొద్ది ఎలుకలు ఉన్నా ( సుమారు 20-30 వేలు ) కంపు వాసన మాత్రం తక్కువే
·        ఈ ఎలుకల దండు ను చూసిన తర్వాత మనసులో ఓ అనుమానం వచ్చింది ..అమ్మవారు అది గ్రహించారో ఏమో ! దేవేందర్ ద్వారా అనుమాన నివృత్తి చేసాడు..ఎలుకలకు “ప్లేగు” రోగానికి అవినాభావసంబంధం ఉంది , దానికి ప్రధాన కారకం ఎలుకలే , అయితే అదే ఆశ్చర్యం ! వందల సంవత్సరాలుగా ఎలుకతో సహవాసం చేస్తున్నా , ఎలుకలు కొరికిన ఎంగిలి చేసిన ప్రసాదాన్ని , రుచి చూసిన పాలను స్వీకరించినా కూడా, ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ఆ ఉపద్రవా ఉనికి లేదు ...సూరత్ ను ప్లేగు వణికించిన తర్వాత , పరిశోధకులు ఇక్కడికి వచ్చి శోధించారట! కాని ఏమి తేల్చలేక చేతులేత్తేశారట, సైన్సుకు దొరకని సమాదానం ..అదే “దైవ లీల “
·        సంవత్సరానికి రెండు సార్లు “మేళా” (ఉత్సవాలు/జాతరలు) జరుగుతాయి , వీలాది మంది భక్తులు వస్తారు , అయితే అప్పుడు కూడా అటు భక్తులకు , ఇటూ ఎలుకలకి ఎలాంటి ప్రమాదం , ఇబ్బంది ఉండదట
   అత్యంత వింత అయిన ఈ ఆలయాన్ని దర్శించి, ఎలుకలు స్వీకరించిన ప్రసాదాన్ని , మనస్పూర్తిగా స్వీకరించిన జాబితాలో ఎందరో వి ఐ పి లూ ఉన్నారు .. భారత రాష్ట్రపతులు శ్రీ రాంనాథ్ కోవింద్, శ్రీమతి ప్రతిభా పాటిల్ మరియు ఎంతోమంది మంత్రులు , ముఖ్య మంత్రులు ఉన్నారు..నాకైతే “తెల్ల ఎలుక “ కనపడలేదు కాని, నన్ను అనుగ్రహించమని, మరోసారి వచ్చే భాగ్యం కలిగించమని  అమ్మవారిని మనసార వేడుకొని , “ దేవేందర్ కు జయహో అంటూ , వింత వింతైన అనుభూతులను నెమరేసుకుంటూ అక్కడినుండి బయటపడ్డాను...మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే మిస్ కాకండే ...HAPPY JOURNEY 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి