ఈ నవల అంతగా నన్ను ఆకట్టుకోవడానికి ప్రధానంగా నేను చరిత్ర విద్యార్థిని కావడం ఒక కారణమైతే , ఆయా పాత్రల చిత్రీకరణ , వాటిని రచయిత నడిపించిన తీరు, ఆ నాటి సామాజిక పరిస్థితులను, మూఢ నమ్మకాలను, విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను కళ్ళకు కట్టినట్లు వివరించడం..అత్యద్భుతం.. నాకు దాశరథి రంగాచార్య రచనలు అంటే చాలా ఇష్టం, ఆయన జీవనయానం, మోదుగుపూలు...నాపై చాలా ప్రభావం చూపాయి. ఒక సినిమా చూసినా కానీ, ఒక పుస్తకం చదివినా కానీ, ఆ తర్వాత కూడా ఆ సినిమా , ఆ పుస్తకంలోని పాత్రలు, సన్నివేశాలు కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడుతున్నాయి అంటే అది చాలా ప్రభావవంతమైన సినిమా/పుస్తకం అనవచ్చు.. ఈ నవల లోని ఎల్లప్ప జెట్టి, పద్మసాని,కంబళి శరభుడు, హండే రాజు, కోడె నీలడు, ఇమ్మడమ్మ,హరియక్క లాంటి సజీవ పాత్రలు కొంతకాలం పాటు మనల్ని వెంటాడుతాయి..
ఈ రచయిత చెప్పినట్లు ఈ నవల కేవలం ఆ నాటి రాయలసీమ చరిత్రనే కాదు, ఆనాటి దళిత బహుజనుల దైన్య జీవితాలను, పాలెగార్ల ఆరాచకాలను, పైవాల్లకు కప్పాలు చెల్లించడం కోసం ప్రజలను దొంగల్లా దోపిడీలు చేసే పాలకులను, భర్త చనిపోతే బలవంతంగా భార్యను చితి ఎక్కించే సతీసహగమనాలు, అగ్రవర్ణాల, పాలకుల కామవాంఛలు తీర్చడం కోసం ఏర్పాటు చేసిన దేవదాసి, బసివిని వ్యవస్థలు, బలహీనవర్గాల పై పాలకులు చేసే లైంగిక దోపిడీలు, సమాజంలో బలంగా నాటుక పోయిన కుల విషవృక్ష పు వికృత ఊడలు, గునిగానప్ప పరసలో పెళ్లయిన కొత్త దళిత జంటలు గుండుకొట్టించుకొని సున్నం బోట్లు పెట్టుకోవాలని లేకపోతే అరిష్టమనుకోనే మూడనమ్మకాలు, కరువు కాటకాలతో సతమతం అవుతున్న సమాజం , వానాల కోసం చేసే ఉత్సవాలు, దేవుడి కోసం గండ కత్తెరతో అంగాంగం కట్టిరించుకుంటూ దేహత్యాగం చేసుకొనే వీర మంటపం లాంటి విశ్వాసాలు ...ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయిందులో.. నవల చదవడం ప్రారంభించినప్పుడు too many characters , facts and incidents అనిపించింది, కానీ ఒకసారి ట్రాక్ లో పడిన తర్వాత ఆ మజానే వేరు..ఇప్పటికే ఇంత మంచి నవల చదవడం ఆలస్యం అయ్యింది, మీరు కూడా చదవండి..సాహితీ లోకానికి మంచి రచనను అందించిన రచయిత Bandi Narayana Swamy గారికి ధన్యవాదాలతో 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి