స్వాతంత్ర్య పునరుద్ధరణ దిన సంబరాల్లో తూర్పు తైమూర్
పోర్చుగీసు నాలుగు వందల సంవత్సరాల వలసపాలన నుండి బయటపడడానికి తైమూరు ప్రజలు తమది చిన్నదేశమే అయినా కూడా పెద్ద పోరాటాన్నే చేసారు. వారి పోరు ఫలితంగా పోర్చుగీసు వారు తోక ముడవడంతో, తైమూరు ప్రజలు 1975 Nov,28 నాడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.కాని వారి ఆశలను అడియాసలు చేస్తూ,పట్టుమని పది రోజులు కాకముందే 1975 Dec,7 నాడు పక్కనున్న ఇండోనేషియా ఏకపక్షంగా ఆక్రమణకు పాల్పడింది, పదిరోజుల తైమూరీ ప్రజల ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, తన నియంతౄత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.తైమూరు ప్రజలకు "పెనం మీద నుండి పొయ్యిలో"పడ్డట్లయింది. మళ్ళీ స్వాతంత్ర్యపోరు ప్ర్రారంభం,కాదు, కాదు స్వాతంత్ర్యపునరుద్ధరణ పోరు ప్రారంభం.అయితే అది ఈసారి పోరు మరింత హింసాత్మకంగా సాగింది.నియంతృత్వ ఇండోనేషియా ప్రభుత్వం ప్రజలను రాచి రంపాన పెట్టింది..యూరోపియన్ దేశాల కు ఏమాత్రం తీసిపోకుండా తన దమనకాండను కొనసాగించింది...ఫలితం దాదాపు రెండు లక్షల మంది తైమూరు ప్రజలను బలి తీసుకుంది, ఇది అప్పటి తైమూరీ జనాభాలో 30 శాతానికి సమానం ...ఇండోనేషియా ఎంతగా ఉక్కుపాదం మోపి, తైమూరు ప్రజల స్వాతంత్ర్యపిపాసను అణచాలని ప్రయత్నంచేసినా కూడా, తైమూరు ప్రజలు మాత్రం మరింతగా ఎగబడి,తెగబడి గెరిల్లాపోరాటం సాగించారు..1991 వ సంవత్సరం మన జలియన్వాలాబాగ్ ను తలపించేలా ఇండోనేషియా " శాంతాక్రజ్ నరమేధానికి" పాల్పడి, 200 మందికి పైగా యువకులను పిట్టలను కాల్చినట్లు కాల్చింది..ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి ఒక్కసారిగా తైమూరు అలుపెరగని పోరాటం వైపు పడేలాగ చేసింది. ఒకవైపు తైమూరీ ప్రజల గెరిల్లా దాడులు, మరోవైపు ఐరాస నేతృత్వంలో ప్రపంచదేశాల వత్తిడితో ఇండోనేషియా ఉక్కిరి,బిక్కిరి అయింది.1999లో ఐరాస అధ్వర్యంలో జరిగిన రెఫరెండంలో తైమూరు ప్రజలు తమ స్వాతంత్ర్యానికి ఓటు వేసుకున్నారు, తప్పని స్థితిలో తప్పుడు ఇండోనేషియా తప్పుకుంది.ఐరాస అధ్వర్యంలో తాత్కలిక ప్రభుత్వం ఏర్పడింది. 2002 లొ ఎన్నికలు జరిపిన ఐరాస అదే యేడులో 20 May నాడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి చేతికి అధికారపగ్గాలు అందించింది..దశాబ్దాలుగా స్వాతంత్ర్యపోరు సాగిస్తున్న తైమూరీ ప్రజల ఆకాంక్షలు ఫలించాయి ,నియంతృత్వ పాలకులనుండీ ఎన్నో బలిదానాలు చేసి,ప్రపంచదేశాల సహాకారంతో్ తమ స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించుకున్నారు...తైమూరు ప్రజల దృష్టిలో ఇదే నిజమైన స్వాతంత్ర్యదినం.
స్వాతంత్ర్యపునరుద్ధరణ జరిగి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి..ఈసారి ఈ వేడుకులకు మరో విశేషం ఉంది... కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన " మతాన్ రువాక్ " అధికారభాద్యతలు ఈరోజే చేపట్టడం.. దానికి తోడు జాతీయ జెండాను ప్రతీ పౌరుడు తన ఇంటి పై ప్రదర్శించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో తైమూరు అంతా ఊరూ,వాడా,గల్లీ,దిల్లి అన్ని వారంరోజుల ముందు నుండే పండగ శోభను సంతరించుకున్నాయి..అర్ద్గరాత్రి పాత అధ్యక్షుడు రామోస్ హోర్తా నుండి కొత్త అధ్యక్షుడు మతాన్ రువాక్ అధికార పగ్గాలు స్వీకరించాడు...టపాకుల మోతలతో దేశం యావత్తు దద్దరిల్లిపోయింది. రాత్రంతా జనానికి ఆనంద జాగారణ...
నేను పని చేస్తున్న "ఐలు"జిల్లాలో సంబరాలు మిన్నంటాయి...పాఠశాల విధ్యార్థుల పరేడ్లు, మారథాన్, జారుడు స్తంభం, టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు...అన్నింటి లో నేను ఎంజాయ్ చేసింది "జారుడు స్తంభం".. దాదాపు ఇరవై అడుగుల ఎత్తున్న ఒక కర్ర స్తంభాన్ని నునుపుగా తయారు చేసి దానికి బాగా నూనే, గ్రీజు దట్టిస్తారు...ఆ స్తంభం పైభాగాన జాతీయ జెండా, డబ్బులు, ఇతర అనేక గిఫ్టులు వేలాడదీస్తారు...ఉత్సాహావంతులైన వారు జర్రున జారుతూ వాటిని చేజిక్కించుకోవాలి (మన ఉట్టి ఉత్సవం గుర్తోస్తుందా ?)..ఇకనేం సాహాసం సేయరా డింభకా స్టార్ట్...
ఉదయంనుండి సాయంత్రం వరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గోనేలా, వారిని "ఎంగేజ్" చేసేలాగ కార్యక్రమాలు రూపోందించారు. స్వాతంత్ర్యదినం జాతీయ పండుగ, కుల,మత,వర్ణ,వర్గ బేదాలు లేకుండా దేశప్రజలు యావత్తు పాలు పంచుకోనే పండుగ.. మన దేశంలో ఇలా
"ఎంగేజ్" చేయలేకపోతున్నాం, కాబట్టి సెలవు దినాన్ని మేడంగారు మురిపెంతో చేసిన చికన్ బిర్యానీని కుమ్మేస్తూ, నచ్చిన హీరోగారి సినిమాను ఎంజాయ్ చేస్తూ, టివీలకు "ఎంగేజ్" అవుతున్నాం....మేరా భారత్ మహాన్...
సరే రామాయంణంలో పిడకలవేట లాగా మన బాధలు, బాగోగులు ఇప్పుడెందుకు...తైమూరు ప్రజల ఆనందాలను పంచుకుందాం..కొన్ని సిత్రాలు మీ కోసం... జై తైమూర్..జై జై తైమూర్....జయ హో తైమూర్.
I GOT IT ! |
KOYADORA and KONDADORA |
AJITH KANGANA (Srilankan Police Officer) IN A HAPPY MOOD WITH LOCALS |
DANCE BABA DANCE...MASTI KARO MAJA KARO |
DANCE MASTER CHANGED INTO DRUM MASTER |
KOYADORA and KONDADORA
రిప్లయితొలగించండిదొర బాగున్నాడు, మూలికలు, పసరు వైద్యం, సోది చెప్పడం లాంటివి కూడా చేస్తాడా ఈ దొర? :)
వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే కామెంటడానికి వీలుగా వుంటుంది.
very good. plz remove word verification
రిప్లయితొలగించండిThanQ u very much to u all
రిప్లయితొలగించండిNice friend you are enjoying the freedom celebrations with Taimoor people
రిప్లయితొలగించండిhappy independence to east tymur
రిప్లయితొలగించండిonly stillena
రిప్లయితొలగించండి