తూర్పు తైమూరు పన్నెండు లక్షల జనాభా మాత్రమే ఉన్న చిట్టి దేశమే అయినా, ఇక్కడ ప్రజలు మట్లాడే భాశలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అత్యధిక తైమూరు ప్రజల వ్యవహారిక భాష "తెతూన్". అయితే వివిధ రకాల తెగల కారణంగా, ప్రాంతీయంగా అనేక భేదాల కారణంగా "ముంబాసా" లాంటి మాండలీకాలు అనేకం ఉన్నాయి. అయితే నాలుగు వందల సంవత్సరాల పోర్చుగీసు వలసపాలన ఆ తర్వాత పాతిక సంవత్సరాల ఇండొనేషియా నియంతృత్వ పాలన వల్ల పోర్చుగీసు మరియు ఇండోనేషియా బహాస భాషలు కూడా తైమూరు లో అంతర్భాగం అయిపొయాయి.దీని వల్ల మెజారిటీ భాశ అయిన " తెతున్" కూడా ప్రభావితం అయ్యింది..ఆయా భాషల నుండి సహజంగానే "ఆదానప్రధానాలు" జరిగాయి..ప్రస్తుతం తైమూరు ప్రజల నిత్యవ్యవహారికం, ఆహారం, అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబొట్టులలోకూడా ఈ రెండు దేశాల ప్రభావం ఉంది. అన్నట్టు.. మా ఉద్యోగ లక్ష్యం నెరవేరి, పెట్టేబేడా సర్దుకోని స్వంత ఊరికి (అదేనండీ..స్వదేశానికి) బయలుదేరే సమయం వచ్చింది..మరి ఇన్ని రోజులుగా వీనుల విందుగా వినిపించిన ఈ "తెతున్"పలుకుకు, పిలుపులు దూరం అవబోతున్నాయి. అందుకే మొత్తంగా కాకున్నా కొంత మాత్రంగానైనా ఈ భాషను "బ్లాకోల్లెగాస్" అందరికి పరిచయం చేయాలనేది నా ఈ ప్రయత్నం. ప్రస్తుతం మనం ఈ కొత్త "తెతున్" భాషను నేర్చుకోనే ప్రయత్నం చేద్దాం, కొన్ని పదాలు మనకు సుపరిచితమే అనిపిస్తాయి..సరదాగా ఈ కొత్త విదేశీ భాషను ఉపయోగించి మీ హితులను, సన్నిహితులను, స్నేహితులను ఓ ఆట ఆడుకోండి.
Good Morning: బోందియా
Good Afternoon: బొటార్డి
Good Night: బొనైతి
కుటుంబం: ఫమిలా
అమ్మ: అమ్మా
నాన్న: అప్పా
సోదరుడు: మావ్
సోదరి: ఫేతోన్
కుమారుడు: ఓన్
కూతురు: ఓన్ ఫేతో
అంకుల్: ట్యూన్
ఆంటీ : తియాన్
కజిన్ : సువ్రీనా
భార్య : ఫేన్ కాబెన్
భర్త: లయన్ కాబెన్
అమ్మమ్మ/నాయనమ్మ: అబో ఫేతో
తాతయ్య: అబో మానే
స్నేహితుడు: కొల్లెగా
(Girl Friend-కొల్లెగా ఫేతో
Boy Friend- కొల్లెగా మానే)
పెద్దమనిషి (Elder person): సినరో
నేను : హౌనియా
నీవు: ఇత్తవో
మీరు: ఇత్తబో
అతను: నియా
ఆమె : నియాఫేతో
How are you ?
(సర్వసాధారణమైన పలకరింపు) డియకలాయ్
Good (బావున్నాను) డియాక్
Not Good (బాలేను) లడియాక్
Cool (ఫర్వాలేదు) మలేరి
Hot ( అంత బాలేను) మానస్
Thanks ఓబ్రిగాడ
your welcome నాడా
Thanks ఓబ్రిగాడ
your welcome నాడా
ఏమిటీ (What) సైడా
ఎక్కడ (Where) ఇహన్నబే
ఏది (Which) ఇత్త
ఎప్పుడు ( When) హాయిర్ బయర్ హీరా
ఎందుకు (Why) తాన్సా
ఎవరు (Who) సే
ఎలా (How) ఇత్తా/ హీరా
పేరు నారన్
ఊరు సూకో
(హల్దియా-Hamlet)
లవర్ డోమిన్
పరదేశి మలయ్
పరదేశి మలయ్
Breakfast మత్తబీసు
Lunch హన్మూడియా
Dinner హాన్కాలన్
హన్ హోనా? భోజనం అయిందా?
అయింది/ కాలేదు హోనా / సిడావు
ఒకటి నుండి పది వరకు
ఇడా, రువా, తోలో, హాత్, లీమా, నేన్, హీతు, వాలో, సియా, సనులో
diyaak
రిప్లయితొలగించండిDurgeswara,
తొలగించండినాడా (No mention)