మూషికాలయం
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళి
నా “మిఠాయి పొట్లం” విప్పుతున్నాను...విషయం అంతలాగా ఉంది కాబట్టి , అర్జంటుగా “అంతర్జాల సహవాసులందరితో
పంచుకోవాలనిపించింది..ఇక మొదలెట్టండి ..
కర్ణి మాత ఆలయం ... రాజస్థాన్ లోని బికనీర్ కు ౩౦
కిలోమీటర్ల దూరంలో ఈ వింతయిన , విచిత్రమైన ఆలయం ఉంది. నా అధికారిక
విధుల్లో బాగంగా బికనీర్ వెళ్ళిన నేను , ఈ ఆలయాన్ని గురించి ఒళ్ళు కంపరం ఎత్తించే , గగుర్పొడించే వింతలు , విశేషాలు విన్న తర్వాత అక్కడికి
ఖచ్చితంగా వెళ్లి తీరాలని డిసైడ్ అయిపోయి , వెల్లోచ్చాను...నిజంగానే ఆలయంలోకి అడుగుపెట్టిన నాకు ఒక రకమైన
గగుర్పాటు కలిగింది,
కారణం...అక్కడ ఒకటి కాదు, రెండు
కాదు, పదులు కాదు, వందలు కాదు ...వేలకొద్ది మూషికాలు చుట్టుముట్టాయి !!.వేలాదిగా ఎలుకలు
అటూ ఇటూ తిరుగుతూ నానా హడావిడి చేస్తూ , మన కాళ్ళ మధ్యనుండి పరుగెడుతుంటే , ఎక్కడ వాటిని తోక్కేస్తామేమోననే కంగారు
ఓ వైపు, మరో వైపు అవి
ఎక్కడ కరుస్తాయోననే భయం..ఇలా లోపలికి అడుగు పెట్టిన తర్వాత భయం, ఆశ్చర్యం,ఆనందం, ఆందోళన ఇలా నవరసానుభూతులు ఒక్కసారే
కలిగాయి..భయం , భయంగా
“కర్నిమాత “ ను దర్శించుకున్నాను, అక్కడా
అమ్మ వారి చుట్టూ , నైవేద్యాల పళ్ళేల చుట్టూ గుంపులు
గుంపులుగా ఉన్నాయి..
కొన్ని నిద్రావస్టలో, మరికొన్ని భుక్తావస్తలో , ఇంకొన్ని సుప్త చేతనావస్థలో , ఇంకొన్నిఆటల్లో , పాటల్లో ....అబ్బో వండర్ఫుల్ ..అసలు
ఆ ఆలయంలో ఇంతగా ఈ ఎలుకల గుంపు ఉండటం వెనుక ఒక కథ ప్రాచారంలో ఉంది.
అమ్మవారు “కర్నిమాత “
దుర్గామాత ఉపాసకురాలు, ఆమెకు
నలుగురు సంతానం , ఆ
నలుగురిలో ఒకరు అ ఆకస్మాత్తుగా మరణించడంతో , కర్నిమాత “యమ ధర్మరాజు “ తో గొడవకు
దిగుతుంది, ఆయన
తోవకు అడ్డుగా నిలుస్తుంది , తన
కొడుకును బ్రతికించే ,
అక్కడినుండి కదులుమని ప్రార్థిస్తుంది ..అయితే సృష్టి ధర్మానికి విరుద్దంగా తానూ
వ్యవహరించలేనని యముడు ,
ససేమిరా అంటూ కర్నిమాత ...ఇక చివరికి మధ్యేమార్గంగా యమధర్మరాజు కర్నిమాత సుతుడికి
పునర్జన్మ ప్రసాదిస్తాడు , అయితే
అది మానవ జన్మ గా కాక “ఎలుక “ జన్మ ను ప్రసాదిస్తాడు.. ఏమైతేనేమి సతీ సావిత్రి
“పతి” కోసం యముడితో పోరాటం చేయగా ,
కర్నిమాత “సుతుడి” కోసం పోరాడి విజయం సాదించింది..అందుకే భక్తులందరూ అప్పటి నుండి
ఈ ఎలుకలని కర్నిమాత సంతానంగా భావించి , వాటిని కూడా అమ్మవారితో సమానంగా భయబక్తులతో ఆరాదిస్తారు , వాటికి కీడు హాని కలిగించే ఎలాంటి
చర్య చేపట్టరు ..
నాకు ఈ ఆలయ వింతలు , విశేషాలు “వి ఐ పి” దర్శనం చేయించిన
“దేవేందర్” కర్నిమాత వంశస్తుడు ..మరికొన్ని విశేషాలు నాతో పంచుకున్నాడు , అవి మీ కోసం ...
·
ఇంతగా
వేలకు వేలకు గుంపులు గుంపులుగా ఎలుకలు తిరిగినా , ఒక్కసారి కూడా చనిపోయిన ఎలుఒక్కటి కూడా కనపడలేదట , వినపదలేదట.
·
ఆలయద్వారాలు
ఉదయం 4 నుండి రాత్రి 10 గంటల వరకు తెరచివున్నా , ఇవి వేలకు వేలు ఉన్నా ఒక్క ఎలుక
కూడా ప్రధాన ద్వారం దాటి బయటికి వెళ్ళవట..
అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ “ సరిహద్దు’ దాటవన్నమాట
ఉదయం నాలుగు గంటలకి మాతకు అభిషేక , నైవేద్య హరతుల అనంతరం చేసే మృదంగ , భేరి నాదాలకు ...అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని “మూషిక దండు “ వేలుగా వచ్చి నైవేద్యాన్ని ఆరంగిస్తాయి. ఇక అప్పటి నుండి మొదలు , రాత్రి వరకు అటు , ఇటూ తిరిగి గోల గోల గా తిరిగి పది కాగానే అన్నీ చటుక్కున మాయమైపోతాయి ( అంటే రెస్ట్ లోకి అని అర్థం }
·
ఎలుకలు
నల్లగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే , “ఎలుక తోలూ తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా , నలుపు నలుపే కాని తెలుపు కాదు “ అనే
పద్యం గుర్తు కూడా వస్తది ..కాని ఇక్కడ “తెల్ల ఎలుకలు “ కొన్ని ఉన్నాయి,
అయితే అవి అప్పుడప్పుడు మాత్రమె కనపడుతుంటాయి ...వాటిని దర్శించుకుంటే
“దరిద్రం “ అంతా పోతుందని , మంచి
రోజులు మస్తుగా వస్తాయని నమ్మకంతో ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు గంటలు గంటలుగా
పడిగాపులు కాస్తుంటారు
·
వేలకొద్ది
ఎలుకలు ఉన్నా ( సుమారు 20-30 వేలు ) కంపు వాసన మాత్రం తక్కువే
·
ఈ
ఎలుకల దండు ను చూసిన తర్వాత మనసులో ఓ అనుమానం వచ్చింది ..అమ్మవారు అది గ్రహించారో
ఏమో ! దేవేందర్ ద్వారా అనుమాన నివృత్తి చేసాడు..ఎలుకలకు “ప్లేగు” రోగానికి
అవినాభావసంబంధం ఉంది ,
దానికి ప్రధాన కారకం ఎలుకలే , అయితే
అదే ఆశ్చర్యం ! వందల సంవత్సరాలుగా ఎలుకతో సహవాసం చేస్తున్నా , ఎలుకలు కొరికిన ఎంగిలి చేసిన
ప్రసాదాన్ని , రుచి
చూసిన పాలను స్వీకరించినా కూడా, ఈ పరిసర
ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ఆ ఉపద్రవా ఉనికి లేదు ...సూరత్ ను ప్లేగు వణికించిన
తర్వాత ,
పరిశోధకులు ఇక్కడికి వచ్చి శోధించారట! కాని ఏమి తేల్చలేక చేతులేత్తేశారట, సైన్సుకు దొరకని సమాదానం ..అదే “దైవ
లీల “
·
సంవత్సరానికి
రెండు సార్లు “మేళా” (ఉత్సవాలు/జాతరలు) జరుగుతాయి , వీలాది మంది భక్తులు వస్తారు , అయితే అప్పుడు కూడా అటు భక్తులకు , ఇటూ ఎలుకలకి ఎలాంటి ప్రమాదం , ఇబ్బంది ఉండదట
అత్యంత వింత అయిన ఈ ఆలయాన్ని దర్శించి, ఎలుకలు స్వీకరించిన ప్రసాదాన్ని , మనస్పూర్తిగా స్వీకరించిన జాబితాలో
ఎందరో వి ఐ పి లూ ఉన్నారు .. భారత రాష్ట్రపతులు శ్రీ రాంనాథ్ కోవింద్, శ్రీమతి
ప్రతిభా పాటిల్ మరియు ఎంతోమంది మంత్రులు , ముఖ్య మంత్రులు ఉన్నారు..నాకైతే
“తెల్ల ఎలుక “ కనపడలేదు కాని, నన్ను అనుగ్రహించమని, మరోసారి వచ్చే భాగ్యం కలిగించమని
అమ్మవారిని మనసార వేడుకొని , “ దేవేందర్’ కు జయహో అంటూ , వింత వింతైన అనుభూతులను నెమరేసుకుంటూ అక్కడినుండి బయటపడ్డాను...మీకు
ఎప్పుడైనా అవకాశం వస్తే మిస్ కాకండే ...HAPPY JOURNEY