14, మే 2012, సోమవారం

తైమూరు ముచ్చట్లు:వరాహా పురాణం

     వరాహా పురాణం

                                             

                                    చూస్తున్నారుగా విచిత్రాన్ని... వరాహం ఎక్కడ పారిపోతుందోనని, మరెక్కడో కొంపకు ఎసరు తెస్తుందేమోననే  భయంతో దాని మెడకి బరువైన ఆభరణాన్ని తగిలించారు కదూ! టు బి ఫ్రాంక్... నాకైతే మొదటిసారి ఇలా వరాహావతారాన్ని చూడగానే ప్రపంచంలో ఎనిమిదవ వింతను చూసినట్లు నోరెళ్ళబెట్టాను (మనదగ్గర పశువుల మెడలకు కట్టగా చూశాము కాని పందుల మెడలకి కట్టగా ఎన్నడు చూడలేదు కనుక ఆ కల్చరల్ షాక్ మామూలే లెండి.) . .. ఏమైతేనేమి నాకు కళ్ళు బైర్లు కమ్మినా, కాళ్ళ కింద భూమి వణికినా కూడ, ఇక్కడ (అదేనండి తూర్పు తైమూరు లో) మాత్రం ఇది  వెరీ, వెరీ కామన్ అని చెప్పాలి. తూర్పు తైమూరు సంస్క్రతిలో పందికి చాలా ప్రాముఖ్యత ఉంది.. పెళ్ళయినా,చావైనా , పుట్టినరోజు వేడుక, ఆఖరికి చర్చి ప్రారంభం అయినా సరే ఏది ఉన్నా లేకున్నాకూడ పంది మాత్రం ప్రెసెంటుగా ఉండాల్సిందే. ( చర్చి ప్రారంభోత్సవం అనంతరం  జరిగిన విందులో  తినడానికి సిద్దంగా,నూనెలో వేయించి, నిలబెట్టిన చిన్న సైజు వరాహాన్ని క్రింది చిత్రంలో మీరు చూడోచ్చు)

              వివాహాలలో అయితే అమ్మాయి వైపు వారు పంది ని తీసుకవస్తే, అబ్బాయి వైపు వారు ఆవు/బర్రె ను తీసుకవస్త్తారు... తర్వాత రెండువైపుల వారు పార్టీ చేసుకుంటారని వేరుగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను..చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ పసందైన  పంది విందు చేసుకుంటారు.అన్నట్లు వీరు అన్ని రకాల  పాకే జీవులను( పాములు, కప్పలు ), వాకే జీవులను (ఆవులు,బర్రెలు,కుక్కలు..ఆఖరికి గుర్రాలు కూడా) మరియు ఎగిరే జీవులను ( కోతులు,పక్షులు వగైరా) కూడా అవురావురుమని తినగలరు. వచ్చిన కొత్తలో ఉదయం, సాయంత్రం అలా వాకింగ్ చేస్తుంటే గ్రామసింహాలు(శునకరాజులండీ బాబు) కొత్తవాడినని నన్ను చూసి తెగ మొరిగేవి,ఇప్పటికీ మొరుగుతున్నాయి కూడా..అయితే నాకు కళ్ళముందు ఐమాక్స్ లొ బొడ్డుసూదులు కనపడుతూ ఉండడంతో, ఎందుకైనా మంచిదని వాటిపట్ల తగిన భయ,భక్తులను ప్రకటించి వినయంగా పక్కకు తప్పుకునేవాడిని...కాని మధ్య అవి అరుస్తుంటే భక్తి, భయం స్తానంలో వాటి పట్ల బాధా, జాళి కలుగుతుంది...అరువమ్మా, అరువు ఎన్ని రోజులు అరుస్తావు, ఏదో ఒక రోజు చుట్టాలొచ్చిన రోజు మీ ఇంటాయన పంటి కింద నలగాల్సిందే కదా అని వేదాంతధోరణిలో సరిపుచ్చుకుంటున్నాను....మళ్ళీ మన వరాహాపురాణానికి వద్దాం...ఇలా వీళ్లకి అన్ని రకాల జీవుల మాంసాలను తినే అలవాటు ఉన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పందికే ఇచ్చేస్తారు. అందుకే ఇక్కడ పంది ధరలు ఆకాశాన్ని అంటేలాగా మండిపోతుంటాయి.ఒక మేకను కొనాలంటే 50 నుండి 70 డాలర్లు పెడితే చాలు, బ్రహ్మండమైనది వచ్చేస్తుంది,   కాని అదే పందిని కొనాలంటే మత్రం మినిమం అయిదువందల డాలర్లు వదిలించుకోవాల్సిందే (మన కరెన్సీలో అక్షరాలా ఇరవై అయిదువేలు)..డబ్బులున్నవాడు చేసుకుంటే కత్తి లాంటి బిజినెస్సు..కాని వీళ్ళకి ఇంకా వ్యాపార బుద్దులు రాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసారు. మా లాంగ్వేజ్ అసిస్టెంటు(దుబాసీ) భవిష్యత్లో పెద్ద పందుల ఫాం పెట్టాలని పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడు..."మన దగ్గర పందులు చాలా చీపూ, అంతగా పట్టించుకోము" అని చెప్పాను... అది విని తెగ ఫీల్ అయ్యాడు, నాతో అన్లేదు కాని విలువైన సంపదను ఎలా వదిలివేస్తున్నారో కదా అని బాధ పడ్డట్లున్నాడు...వచ్చే సంవత్సరం ఇండియా వచ్చి పందులను కొంటానంటున్నాడు...కావునా కొల్లెగాస్( అంటే మిత్రులారా అని) మీలో ఎవరికైనా ఇంటరెస్ట్గ్ ఉంటే చెప్పండి..రెఫరెన్స్ ఇస్తాను, మా వాడితో కలిసి "పందుల ఎగుమతుల" వ్యాపారం చేద్దురుగాని. పుట్ట లో పాముందో ఎవరికి తెలుసు  మన చీపు వరాహం మీకు కుప్పలు తెప్పలు గా వరహాలు(డబ్బులు) తెచ్చిపెట్టవచ్చు. ....కావునా కొల్లెగాస్ ఆలస్యం చేసినా  ఆశాభంగం, మంచి అవకాశం మళ్ళీ మళ్ళీదొరకదు. సో... కమాన్, కం టు తైమూర్..ఆల్ బెస్ట్, గో అహెడ్.



10 కామెంట్‌లు:

  1. ప్రియమైన అన్నయ్యకు .....

    చాలరోజుల తరువాత ఒక్క ఆంగ్లముక్క లేని శుద్దిచేసిన తెలుగు విని,వినిపించిలని దాహముతో ఉన్న నాకు ఒయాసిస్సు లా నీ మిటయి పోట్లాము ఆనందమును,అతిశయమును కూడా కలిగించినది..ని మిటాయికి నా తీపి ని మరియూ కొన్ని కాజులను కలిపి మరింత హాయిని గోల్పలని ....నీ తో సవివరముగా మాట్లాడుతూ ఉంటాను

    రిప్లయితొలగించండి
  2. interesting! ఇలా కూడా ఉంటుందా!!!! అనిపించింది. క్రొత్త విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  3. బాబ్బాబు అడ్రస్ చెప్పండి! రేపే వచ్చేసి పందుల వ్యాపారం చేసేసి కోట్లు కూడ బెట్టేయాలి, మరెవరికీ చెప్పకండీ! మీకూ.......అమ్యా...తెలిసిందనుకుంటా..

    రిప్లయితొలగించండి
  4. ఓ కొల్లెగాస్ గారు, (పేరు బాగుంది, ఏకవచనంలో 'ఓ మిత్రమా' అనాలంటే 'ఓ కొల్లెగా' అంటే చాలా?!)
    కొత్త విషయం చెప్పారు, బావుంది. మనపందులకు అక్కడ అంత ఖరీదు పలుకుతుందంటే విని ఆనందంగా వుంది. అయిననూ... మన వూరపందులను ఎక్స్‌పోర్ట్ చేసి ఇక్కడి పందిప్రియుల పొట్టలు కొట్టడం న్యాయమా?! బదులుగా ఒక్కొక్కరు 100 వరాహములకు దీటైన BSP, RJD, Congress,DMK వైకాప, తెరాస, ప్రరాప, ప్రజాశాంతి, ఇత్యాది నాయకులను ఎక్స్‌పోర్ట్ చేస్తే చాలదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తైమూరీ భాషలో "కొల్లెగా" అంటే స్నేహితుడని అర్థం..కాబట్టి మన బ్లాగు మిత్రులందరిని సంధి చేసి " బ్లాకొల్లెగాస్" అని నామకరణం చేసేసాను.మీరన్నది నిజమే..మనదగ్గర ఊ.ప.లకు ఏమాత్రం తీసిపోని కొన్ని శాల్తీలున్నాయి, వారిని పంపిద్దామనుకొన్నకూడా అక్కడి పందులు, పబ్లిక్కు కూడా దగ్గరికి రానివ్వరేమో.తమను వీళ్లతొ పోల్చడమేంటని
      తైమూర్ పందులు కూడా ఫీల్ అవుతాయనుకుంటా!.అయినా ప్రయత్నం చేస్తా! హా..హ..హ్హహహ...

      తొలగించండి